29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

పీఎంఎఫ్ఎం ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

ఏపీఏం. బి.మాణిక్యం

 

వేల్పూర్, బతుకమ్మ : మహిళా ఆర్ధిక సాధికారత కోసం కిసాన్ కేంద్రం మహిళలకు అందిస్తున్న పీఎంఎఫ్ఎంఈ రుణాలను మహిళలు వినియోగించుకొవాలని ఐకేపీ ఏపీఎం బి. మాణిక్యం కోరారు. గురువారం మండలంలోని రామన్నపేట గ్రామ వెన్నల మహిళ సంఘంకు చెందిన సభ్యురాలు కుంబాజీ తిరుమలకు పిండి గిర్నీ కింద మంజూరైన రూ.1,50,000 చెక్కును టీజీబి మేనేజర్ చంద్రకాంత్ రెడ్డి తో కలిసి ఏపీఎం అందజేశారు. ఈ సందర్బంగా ఏపీఎం మాట్లాడుతూ మహిళలకు ఫుడ్ ప్రాస్సేసింగ్ యూనిట్ల ద్వారా ఈ రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీలు ప్రకాశం, సాయన్న, విఓఏ లు మాణిక్ రావు, మనోరంజని, కవిత, మహిళా సంఘాల అధ్యక్షులు, సభ్యులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article