విపక్షాల నిరసనల మధ్యే బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలాసీతారామన్
లోకసభ మార్చి 10కి వాయిదా
డిల్లీ, బతుకమ్మ : దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. గురువారం నూతన ఆదాయపు పన్ను బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చింది. ఈమేరకు విపక్షాల నిరసనల మధ్యే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఈబిల్లును లోకసభలో ప్రవేశపెట్టారు. దీంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం కాసేపటికే లోకసభ మార్చి 10కి వాయిదా పడింది.
