గాంధీ ఆసుపత్రికి తరలింపు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని ఒకటో టౌన్ పరిధిలోని దేవి రోడ్డు చౌరస్తాలో వృద్ధుడి పై దాడి జరిగింది. ఈఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. నగరంలొని వర్నిరోడ్డు సాయినగర్ కు చెందిన దర్శనం లక్ష్మణ్ (70 ) బుధవారం నుంచి కనిపించకుండా పోయాడు. గురువారం ఉదయం స్థానిక దేవిరోడ్డు చౌరస్తాలోలక్ష్మణ్ గాయాలతో పడి ఉండగా గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఒకటో టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని అతడి వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వృద్ధుడి పై దాడి చేయాల్సిన అవసరం ఏమిటి, ఎవరు చేశారు అనే కోణంలో విచారిస్తున్నారు.
