టీపీటీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వై. అశోక్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తనను గెలిపిస్తే శాసనమండలిలో ఉపాధ్యాయుల పక్షాన ప్రశ్నించే గొంతుక అవుతానని టీపీటీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి యెర్ర గుంట అశోక్ కుమార్ అన్నారు. బుధవారం ఉదయం నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానం లో వామపక్ష ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయులను తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రైవేట్ హోటల్ లో విలేకరులతో ఆశోక్ మాట్లాడుతూ.. తన జీవితమంతా విద్యా రంగంలో కొనసాగిందన్నారు. విద్యా సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, ఉపాధ్యాయ సంఘం నేతగా అనేక ఉద్యమాలు చేశానని గుర్తు చేశారు. . తాను ఏ పార్టీకి చెందిన అభ్యర్థిని కాదని, తనకు సొంత వ్యాపారాలు లేవని స్పష్టం చేశారు. విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అశోక్ కుమార్ పేర్కొన్నారు. ప్రధానంగా పెండింగ్ బిల్లులు, కేజీబీవీ సమస్యలు, ఇంటర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై పోరాడుతానని హామీ ఇచ్చారు. విద్య ప్రైవేటీకరణ కు వెళ్లే అవకాశం ఉందని, దీంతో పేదలకు చదువు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. సమావేశంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెనిగళ్ళ సురేష్, అరవింద్, సీనియర్ నాయకులు వేణుగోపాల్, విజయ్ కుమార్, యుటిఎఫ్ నాయకులు గంగాధర్, డాక్టర్ సూరి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
