గెలిపిస్తే ఉపాధ్యాయుల పక్షాన ప్రశ్నించే గొంతుక నవుతా

  టీపీటీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వై. అశోక్  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తనను గెలిపిస్తే శాసనమండలిలో  ఉపాధ్యాయుల  పక్షాన ప్రశ్నించే గొంతుక అవుతానని టీపీటీఎఫ్  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి యెర్ర గుంట అశోక్ కుమార్ అన్నారు. బుధవారం  ఉదయం  నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానం లో వామపక్ష ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయులను తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా నగరంలోని  ప్రైవేట్ హోటల్ లో  విలేకరులతో ఆశోక్ మాట్లాడుతూ.. తన జీవితమంతా విద్యా రంగంలో...