29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ప్రభుత్వాసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని  రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. జాతీయ తీగ నివారణ కార్యక్రమంలో భాగంగా టీకాలను రిఫ్రిజిరేటర్ లను పరిశీలించారు. గర్భిణీ స్త్రీలకు చేస్తున్న రక్త పరీక్షల గురించి ల్యాబ్ టెక్నీషియన్ అనిత రాథోడ్ ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రతిరోజు రోగులకు ఇస్తున్న మందులు వివరాలను ఫార్మసిస్ట్ విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. కాలం చెల్లిన మందులు ఉన్నట్లయితే  తొలగించాలని, ఇన్ పేషెంట్ వార్డును పరిశీలించి ఒక గర్భిణీ స్త్రీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు అన్ని రకాల మందులు  అందజేయాలని వైద్యాధికారి డాక్టర్ సుశాంత్ రెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యురాలు డాక్టర్ భువన, ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

Medical staff should be available to patients

More articles

Latest article