వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలి
ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య ప్రభుత్వాసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. జాతీయ తీగ నివారణ కార్యక్రమంలో భాగంగా టీకాలను రిఫ్రిజిరేటర్ లను పరిశీలించారు. గర్భిణీ స్త్రీలకు చేస్తున్న రక్త పరీక్షల గురించి ల్యాబ్ టెక్నీషియన్ అనిత రాథోడ్ ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రతిరోజు రోగులకు ఇస్తున్న మందులు వివరాలను ఫార్మసిస్ట్ విజయలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. కాలం చెల్లిన మందులు...