28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆర్థిక సహాయం అందజేత

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి,బతుకమ్మ: ఇందల్వాయి మండలంలోని గౌరారం గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ముక్కెర గంగాధర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, మాజీ సర్పంచ్ ఇమ్మడి లక్ష్మి  లు సోమవారం వారి కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుల కోసం5000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. ఆపదలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి తన వంతు ఆర్థిక సహాయం అందజేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లారం చిన్న గంగారాం, తోగారి సాయిలు, పళ్ళికొండ నరేష్, కమ్మరి రాజు, పళ్ళికొండ చిన్న నర్సయ్య, ఒడిగే గంగరాజాం, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article