27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన ఎన్ సీ సీ ఆఫీసర్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్:  మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎన్ సీ సీ (నేషనల్ క్యాండిడేట్ కార్ప్ )యూనిట్ మంజురవుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ టీ.పెద్దన్న ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఎన్ సీ సీ హెడ్ క్వార్టర్ నిజామాబాద్ నుండి వచ్చిన అనోజ్ అధికారి పరిశీలించి ధ్రువీకరించినట్లు పేర్కొన్నరు. అధికారులు కళాశాలను సందర్శించి కళాశాల ప్రాంగణం మౌలిక వసతులను పరిశీలించారని పేర్కొన్నారు. ఎన్ సీ సీ యూనిట్ మంజూరు కావాల్సిన అన్ని వసతులు విద్యార్థుల సంఖ్య భవనము గ్రౌండ్ కంప్యూటర్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయని ధ్రువీకరించారు దేశ రక్షణలో త్రివిధ దళాలు నిర్వహిస్తున్న పాత్ర పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడానికి సైనిక శిక్షణకు క్రమశిక్షణకు దేశభక్తి పెంపొందించుటకు ఎన్ సీ సీ యూనిట్ పనిచేస్తుందని పేర్కొన్నారు ఎన్ సీ సీ ఇంచార్జి గా మర్రిపల్లి భూపతిని నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు రాజయ్య, రవీందర్ ,బ్యూలా, అవంతి ,అశోక్ సిబ్బంది గంగారం ,భాగ్యన్న ,అశోక్ నవీన్ ,జయ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article