29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

గంజాయి విక్రయిస్తున్న 8 మంది రిమాండ్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న 8 మందిని శుక్రవారం రాత్రి రిమాండ్ కు పంపినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి భిక్కనూర్ కు తరచుగా గంజాయి తీసుకొస్తూ మండలంలోని ఇతర గ్రామాల యువకులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈమేరకు వారిని అరెస్టు చేసి వారి వద్ద  నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జ్యూడిషియల్ రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. మండలంలోని యువకులు గంజాయి మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సదా, రాజా గౌడ్ ,సంతోష్, అశోక్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

More articles

Latest article