23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

భక్తిశ్రద్ధలతో కుంభాభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

Kumbhabhishekam with Bhaktisradhas

మంథని, బతుకమ్మ: కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజులపాటు ఘనంగా మ  హా కుంభాభిషేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంపై కలెక్టర్ రాహుల్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ మహోత్సవాల్లో భాగస్వాములైన అన్ని శాఖల జిల్లా అధికారులను, సిబ్బందిని, జిల్లా యంత్రాంగం సలహాలు, సూచనలు పాటిస్తూ సహకరించిన భక్తులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. మహా కుంభాభిషేక వేడుకలు ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగాయన్నారు. కార్యక్రమ విజయానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించారని అన్నారు. భక్తుల భద్రత, సౌకర్యాలను పర్యవేక్షిస్తూ సజావుగా నిర్వహించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.

Kumbhabhishekam with Bhaktisradhas

More articles

Latest article