- బిజెపి మండల అధ్యక్షులు ఆలంపాటి హరికృష్ణ
రుద్రూర్, బతుకమ్మ : నరేంద్ర మోడీ ప్రభుత్వ పథకాలు బిజెపిని గెలిపించాయని రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలంపాటి హరికృష్ణ అన్నారు. ఢీల్లిలో బిజెపి పార్టీ గెలిచిన సందర్బంగా శనివారం రుద్రూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు టపాకాయలు పేల్చి, స్విట్లు పంచుతూ విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ.. 27 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. గత 13 సంవత్సరాల నుండి ఢీల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ ఆగడాలను అరికట్టడానికి ముందుకు వచ్చిన ఢీల్లి ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ పథకాలు బిజెపిని గెలిపించాయని అదే ఢీల్లి ఎన్నికల సమయంలో పార్టీ గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ప్రశాంత్ గౌడ్, ఏముల గజేందర్, కటికె రామ్ రాజ్, వడ్ల సాయినాథ్, కుమ్మరి గణేష్, శంకర్ పటేల్, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
