26.3 C
Hyderabad
Monday, August 3, 2026

దోబూచులాట…

Must read

📰 Generate e-Paper Clip

  • అటు భూమి ఇటు  
  • అసైన్డ్ లో పట్టా భూమి  
  • సర్వే అధికారుల లీలలు
  • తప్పుడు నివేదికలతో భూంఫట్
  • కోట్ల రూపాయల భూమికి ఎసరు

 

నిజామాబాద్, బతుకమ్మ : 

సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అంటే అధికారులంటే కాసులు చేతిలోపడితే చాలు భూమినే మాయం చేస్తారు. లేని భూమిని ఉన్నట్లు చూపించడంలో సిద్దహస్తులు అనే పేరు ప్రసిద్దికెక్కింది. రెవెన్యూ రికార్డులు ఎలా ఉన్నా వారు తలుచుకుంటే అసైన్డ్ భూములు పట్టా భూములవుతాయి. అందుకు నిదర్శనం ఇటీవల జిల్లా కేంద్రంలోని కోట్ల రూపాయల భూమికి కొందరు ఎసరు పెట్టారు. వారికి ఉన్న ఏకైక ఆధారం ల్యాండ్ సర్వే అధికారులు ఇచ్చిన పంచనామా రిపోర్టే ఆధారం.

Looting...

జిల్లా కేంద్రంలోని దక్షిణ మండలం తహసీల్ధార్ పరిధిలోని బాబాన్ సాహెబ్ పహాడ్ ప్రాంతంలో ఎప్పుడో నాలుగు ఎకరాల పట్టా భూమిని వారసులు పంచుకోవడం, అమ్ముకోవడం జరిగిపోయింది. ఇటీవల కాలంలో 2166 అనే సర్వే నంబర్ లో నందిగుట్ట ప్రాంతంలో ఉన్న పట్టా భూమి కాస్తా రోడ్డును దాటింది. స్థానికంగా తారురోడ్డు విస్తరణకు సమయంలో సంబంధిత పట్టా భూముల యజమానులకు పరిహారం కూడా అందింది. కానీ పక్కా ఆధారాలతో రెవెన్యూ శాఖ వద్ద వివరాలు ఉన్నప్పటికీ ల్యాండ్ సర్వే అధికారులతో కొందరు కుమ్మక్కుకావడంతో కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్నం జరిగింది. గత ప్రభుత్వ హయంలో మైనార్టీ గురుకుల పాఠశాలను నిర్మించగా మిగిలిన స్థలంపై కన్నుపడిన కొందరు దానిని చెరబట్టేందుకు తెరలేపారు. మైనార్టీ గురుకుల పాఠశాలకు  రెండువైపులా ఉన్న భూమి పట్టా భూమి అని ల్యాండ్ సర్వే అధికారులు ఇచ్చిన పంచనామా రిపోర్టు ఆధారంగా కబ్జాకు తెర లేపారు. గతేడాది చివరి మాసంలో ఈ తతంగం జరిగింది. సంబంధిత భూమి విషయంలో ల్యాండ్ సర్వే అధికారులు చేసిన సర్వేకు అటవి శాఖ రేంజ్ అధికారి కూడా వంత పాడడం విశేషం. అటవి శాఖాధికారులు ఎన్ వో సీకి దరఖాస్తు చేసుకుంటే దానిని ప్రభుత్వం ఉత్తర్వులుజారీ చేయాల్సిన సమయంలో అటవి రేంజ్ అధికారి సంబంధిత భూమి అటవి శాఖకు సంబంధం లేదని సంతకాలు చేయడం గమనార్హం.

Looting...

డిసెంబర్ మాసంలో బతుకమ్మ దినపత్రికలో రాత్రికి రాత్రే  ప్రభుత్వ భూమిలో కబ్జాలు అని  కథనం ప్రచురించడం జరిగింది. దానితో అందులో రేకుల షెడ్డు ద్వారా జరిగిన ఆక్రమణలను స్వచ్చందంగా వారే తొలగించుకున్నారు. అయితే దశాబ్ధం క్రితమే పట్టా భూమిని అమ్ముకున్న వారసులమని కొందరు సంబంధిత సర్వే నంబర్ లో నాలుగు ఎకరాల భూమి మాత్రమే వారసులు మిగిలి ఉండగా ఆ భూమిపై పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగినా మళ్లీ అసైన్డ్ భూమిలో తమ భూమి మిగిలిందని కొత్త నాటకానికి తెరలేపారు. వారికి ల్యాండ్ సర్వే అధికారులు తోడు కావడంతో ఏకంగా అటవి శాఖ  సరిహద్దులను ఆనుకుని ట్రిమ్స్ ఇరువైపుల ఫ్రీకాస్ట్ (శాశ్వత గోడ) ద్వారా నిర్మాణం  చేపట్టడం విశేషం. ఈ విషయంలో ఆరోపణలు రావడం కొందరు జిల్లా కలెక్టర్ తో పాటు ప్రభుత్వానికి కోట్ల రూపాయల  ప్రభుత్వ భూమి కబ్జాపై ఫిర్యాదు చేశారు. దానితో ట్రిమ్స్ భవనం కుడివైపున ఉన్న కబ్జాలను గురువారం తొలగించారు. దానికి ఎడమవైపు ఉన్న కబ్జాలను కూడా తొలగించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అటవి శాఖాధికారులు సైతం సంబంధిత భూమి అటవి శాఖకు చెందిందని  కొత్తగా బోర్డు ఏర్పాటు చేయడం కబ్జాదారులకు, అధికారులకు షాక్ ఇచ్చింది.

Looting...

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ల్యాండ్ సర్వే అధికారులు తప్పుడు నివేదికలతో సర్కార్ భూమిని పట్టా భూమిగా ఎలా చూపుతారని విమర్శలు వస్తున్నాయి. వారికి అటవి శాఖాధికారులు వంతపాడడంపై ఆరోపణలున్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల స్వాహా కార్యం వెనుక అధికారులు ఉండడంతో ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారోననే చర్చ జరుగుతుంది. ఎందుకంటే జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూములు లేక కార్యాలయాలు ఇతర  అవసరాల కోసం అద్దె భవనాల్లో, అద్దె స్థలాలు ఉన్నాయి. ప్రభుత్వ భూములను కాజేయడం వెనుక ఉన్న అధికారులపై ముందుగా చర్యలు తీసుకుంటే కానీ భవిష్యత్తులో మరెవ్వరు సహకరించరని ప్రజల వాదనలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు, అటవి శాఖ రికార్డులు, ప్రభుత్వ అటవి భూములుగా ఉన్న వాటిని పట్టా భూములుగా రికార్డులు ఎలా ఇస్తారన్న చర్చ జరుగుతుంది.

Looting...

More articles

Latest article