27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పద్మకు డాక్టరేట్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్ : మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న పద్మకు డాక్టరేట్ రావడం సంతోషకరమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.టి పెద్దన్న అన్నారు. పద్మ రసాయన శాస్త్రంలో ఫార్మసిటికల్ కెమిస్ట్రీ విభాగంలో చేసిన పరిశోధనకు గాను తెలంగాణ యూనివర్సిటీ నుండి పట్టా పొందిన సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది ఆమెను ఘనంగా శాలువాతో సన్మానించారు. ఆమె జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Padma has a doctorate

More articles

Latest article