- సిపీఐ (ఎంఎల్ )మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయకార్యదర్శి ఆర్.రమేష్
భీమ్ గల్, బతుకమ్మ : కామ్రేడ్ కే.యాదగిరి నిరంతర విప్లవోధ్యమ కార్యశీలి అని ఆయన స్పూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మించాలని సిపీఐ (ఎంఎల్ )మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయకార్యదర్శి ఆర్.రమేష్ పిలుపును ఇచ్చారు. శుక్రవారం భీమ్ గల్ మండల కేంద్రంలోని సిపీఐ (ఎంఎల్ )మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో యాదగిరి సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కామ్రేడ్. యాదగిరి అన్న జిల్లాలో విప్లవోధ్యమ నిర్మాణంకు పునాదులు వేసిన మూల స్థంబం లాంటి వాడు అన్నారు. అనేక మంది కార్యకర్తలను తీర్చిదిద్ది అందరికి ఆదర్శంగా నిలిచారన్నారు . సిరికొండ మండలంతో పాటు భీమ్ గల్ పాత తాలూకాలో పెత్తందారుల దోపిడీకి వ్యతిరేకంగా బలమైన విప్లవ పోరాటాలను నిర్మించిన కమ్యూనిస్ట్ యోధుడని,కులావివక్షతకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణంకు కృషి చేసాడని ఆయనను స్మరించుకోవడం అంటే విప్లవ పోరాటాలను నిర్మించాడమే అన్నారు. నేటి యువతకు ఆదర్శంగా కామ్రేడ్. యాదగిరి అన్న ఆదర్శంగా నిలిచాడని, ఆయన పోరాట వారసత్వాన్ని కొనసాంచాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సి. పీ.ఐ (ఎం. ఎల్ )మాస్ లైన్ భీంగల్ మండల నాయకులు యు.లక్ష్మణ్ అధ్యక్షత వహించగ డివిజన్ నాయకులు కే.రాజేశ్వర్, ఆర్.దామోదర్, బి.బాబాన్న, జిల్కర నడ్పినర్సయ్య, మండల నాయకులు ఈ రమేష్,ఎం. డీ . అనిస్,సి. హెచ్.రాజేశ్వర్, అశోక్, రాజు, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.
