మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలిసిన ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల యాజమాన్యాల బృందం
నిజామాబాద్, బతుకమ్మ : ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదలకు తన సహకారం ఉంటుందని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని తన నివాసంలో బకాయిలు విడుదల చేయాలని ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల యాజమాన్యాల బృందం ఆయన్ను కలిసి విన్నవించుకున్నారు. ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలను తీసుకు వెళ్లాలని కోరారు. కొన్ని ఏళ్లుగా బకాయిలు విడుదల కాకపోవడంతో కళాశాల సిబ్బందికి జీత భత్యాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. భవనాల అద్దె చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి పది రోజుల్లో బకాయిలు విడుదల చేయిస్తానని మాజీ మంత్రి హామీ ఇచ్చారని వారు తెలిపారు. కార్యక్రమంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షులు హరిప్రసాద్, కార్యదర్శి సంజీవ్, మారయ్య గౌడ్, నిశిత రాజు, సూర్యప్రకాష్, శంకర్, జైపాల్ రెడ్డి, నరాల సుధాకర్, గిరి, దత్తు, శ్రీనివాస్, రషీద్, రమణ, వెంకటేష్ , తదితరులు పాల్గొన్నారు.
