. . . నిర్వహకుడితో పాటు పెకాట రాయుళ్ల ఆరెస్ట్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మి ప్రియ నగర్ ప్రాంతంలోని కస్తుర్బా కాలనీలో ఓక ఇంటిలో జరుగుతున్న పెకాట స్థావరం పై టాస్క్ పోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిజామాబాద్ ఇంచార్జీ సిపీ సిందుశర్మ అదేశాలతో నిజామాబాద్ సిసిఎస్ ఎసిపీ, ఇంచార్జీ టాస్క్ పోర్స్ ఎసిపి, టాస్క్ పోర్స్ సిఐ అంజయ్య అధ్వర్యంలో సిసిఎస్ సిబ్బంది గురువారం దాడులు నిర్వహించారు. పెకాట స్థావరం నిర్వహకుడు తోట సత్యనారాయణ అలియాస్ సత్యంతో పాటు ఎడుగురు పెకాట రాయుళ్లు పట్టుబడ్డారు. వారి వద్ధనుంచి 7 సెల్ పోన్ లు, రూ.30,500 స్వాధినం చేసుకున్నారు. వారిని రూరల్ పోలీసులకు అప్పగించారు. పెకాట నిర్వహకుడు సత్యం పై నిజామాబాద్ నగరంలోని పలు పోలీస్ స్టేషన్ లలో పెకాట కేసులు ఉన్నట్లు తెలిసింది.
