23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రమాదవశాత్తు ఎలక్ట్రీక్ ఆటో దగ్ధం

Must read

📰 Generate e-Paper Clip

నగరంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  చార్జీంగ్ పెట్టిన ఎలక్ట్రీక్ ఆటో ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని ఆటో నగర్ కు చెందిన మహ్మద్ మెహతాబుద్ధిన్ ఆటో నడుపుతు జీవిస్తున్నాడు. 2025  జనవరిలో కొత్త ఎలక్ట్రీక్ ఆటో కోనుగోలు చేశారు. బుధవారం రాత్రి తన ఇంటి ముందు ఆటో ( టీజీ 16 సీటీఆర్ 7656) ను నిలిపి చార్జింగ్ పెట్టి మర్చిపోయాడు. తెల్లవారి లేచి చూసేసరికి ఆటో పూర్తిగా కాలిపోయింది. దాంతో పాటు ఇంటి ముందు ఉన్న సామగ్రి దగ్ధమైంది. రూ. లక్ష వరకు నష్టం సంభవించిందని బాధితుడు వాపోయాడు. ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article