25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణ కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోదిరే స్వామి

 

భీమ్ గల్, బతుకమ్మ : కేంద్ర బడ్జెట్ లో నిధుల కేటాయింపు విషయంలో రాష్ట్రం పై చూపిన వివక్షకు భాద్యత వహిస్తూ తెలంగాణ రాష్ట్ర కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వెంటనే రాజీనామా చేయాలనీ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ బోదిరే స్వామి డిమాండ్ చేశారు. నిధుల కేటాయింపులో కేంద్ర వివక్షకు నిరసనగా మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామాన్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. కేంద్రం రాష్ట్రం పట్ల ఇంత వివక్ష చూపిన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరించడం సిగ్గు చేటు అన్నారు. ఈ కార్యక్రమం  పట్టణ అధ్యక్షులు జేజే నరసయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పరిష అనంతరావు,ఎస్టీ సెల్ అధ్యక్షులు గోపాల్ నాయక్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు, మహిళా అధ్యక్షురాలు కల్పన, బీసీ సెల్ అధ్యక్షులు కోరాడి రాజు,మల్లెల లక్ష్మణ్, సీఎచ్ గంగాధర్,ముచ్కూర్ సొసైటీ చైర్మన్ బంగ్లా దేవేందర్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ దొరకంటి రాజేష్,మూడేడ్ల అశోక్,వల్లి,చింటూ,మహేష్, శివ,సాయిబాబా,గంగాధర్,కిషన్,సురేష్,ఆంగోత రమేష్,జుబేర్,నవీద్,జిశాన్,ధనుష్,సేవలల్,శీను,అజ్మత్,రాము,నవీన్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article