29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సామూహిక అక్షరాభ్యాసం

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని పురానిపేట్  మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సామూహిక అక్షరాబ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.పురానిపేట్ వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారి పద్మ గంగయ్య,. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాస శ్రీనివాస్,గ్రామభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక  గ్రామ  ప్రజలు తమ పిల్లలను స్వచ్చందంగా తీసుకొని వచ్చి అక్షరాభ్యాసం చేయించుకున్నారు. ఇట్టి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అర్చకులు శ్రీ రాజేష్  బాసరలోని శ్రీ సరస్వతీ ఆలయము  నుండి తెప్పించిన కుంకుమ, సరస్వతీ మాత విగ్రహం ముందు  60 మంది చిన్నారులకు  సామూహికంగా అక్షరాభ్యాసం చేయించి ఆశీస్సులను అందజేసినారు.  ఈ సందర్బంగా పాఠశాల  ప్రధానోపాధ్యాయులు  శ్రీనివాస్ మాట్లాడుతూ….. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులు భవిష్యత్తులో మంచి స్థానంలో స్థిరపడతారని, దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారవుతారని, ప్రతి పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుకోవాలని,వారికి విద్య విషయంలో ఏదైనా అనుమానాలు ఉన్న స్కూల్ కు వచ్చి మమ్ములను అడగాలన్నారు. ప్రైవేట్ స్కూళ్ల కన్నా విద్యను మేము మంచిగా బోధిస్తున్నామని, స్కూల్ కి వచ్చి విద్యా విషయంలో  తల్లిదండ్రులు కనుక్కోవాలని తెలిపారు.అలాగే చిన్నారులను అక్షరాభ్యాసం చేయించుకోవడానికి తీసుకువచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గ్రామానికి చెందిన పద్మ వీర గంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు నోట్ బుక్స్,పెన్నులు,పలకలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రాస శ్రీనివాస్,ఉపాధ్యాయ బృందం, విలేజ్ కమిటీ సభ్యులు, శ్రీనివాస్ గౌడ్,శ్రీనివాస్,మాజీ సర్పంచ్ బుర్ర దేవేందర్ గౌడ్, పద్మ జగదీశ్వర్, చాడ రవీందర్,గ్రామస్తులు,విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article