- బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యకే బీసీటీయూ మద్దతు ఉంటుందని జిల్లా అధ్యక్షుల మాడవేడి వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హోటల్ లో సోమవారం బిసి ఉపాధ్యాయ సంఘం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లకై, బిసి లకు క్రమిలేయర్ విదానం రద్దు కొరకై, బిసి లకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కై, కరీంనగర్ ఉపాధ్యాయ ఎం ఎల్ సి అభ్యర్థి గా పోటీ చేస్తున్న విద్యావేత్త మల్క కొమరయ్య కు బిసిటియు మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి అభ్యర్థి మల్క కొమరయ్య, రెంజర్ల నరేష్, బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, గౌరవ అధ్యక్షులు కైరంకొండ బాబు, బిసిటియు నాయకులు కొట్టాల రామకృష్ణ, కొట్టూరు రమేష్, శంకర్ రమణ స్వామి తదితరులు పాల్గొన్నారు.

