సామూహిక అక్షరాభ్యాసం

భీమ్ గల్, బతుకమ్మ : వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని పురానిపేట్  మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సామూహిక అక్షరాబ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.పురానిపేట్ వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారి పద్మ గంగయ్య,. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాస శ్రీనివాస్,గ్రామభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక  గ్రామ  ప్రజలు తమ పిల్లలను స్వచ్చందంగా తీసుకొని వచ్చి అక్షరాభ్యాసం చేయించుకున్నారు. ఇట్టి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అర్చకులు శ్రీ రాజేష్  బాసరలోని శ్రీ సరస్వతీ ఆలయము  నుండి తెప్పించిన కుంకుమ, సరస్వతీ...