28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

దాతకు సర్వ సమాజ్ సన్మానం 

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ధాత జొన్నల భూపాల్ ను భీమ్ గల్ సర్వ సమాజ్ ఆదివారం ఘనంగా సన్మానించింది. భూపాల్ కు సర్వ సమాజ్ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు శాలువ, పూలమాలల తో సన్మానించి సత్కరించారు. సన్మాన గ్రహీత భూపాల్ మరణించిన తన తమ్ముడు కీ. శే. జొన్నల భూపేందర్  స్మారకార్థం బాడీ ఫ్రీజర్ ను సర్వ సమాజ్ కు డొనేట్ చేశారు. ఈ సందర్బంగా పట్టణ ప్రజల కోసం అలోచించి అవసరానికి ఉపయోగపడే వస్తువు తనంతట తానుగా డొనేట్ చేయడం గొప్పవిషయమని,ఇలాంటి వ్యాపారస్తులకు మేము సర్వదా అండగా ఉంటామని సర్వ సమాజ్ కమిటీ అన్నారు. ఈ కార్యక్రమం లో సర్వ సమాజ్ ప్రెసిడెంట్ నీలం రవి, వైస్ ప్రెసిడెంట్ భార్ల మోహన్, ట్రెజరర్ కాపు కుమారి హరీష్, రైటర్ పర్స నవీన్, సలహా కమీటీ సభ్యులు, సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article