29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పేకాట రాయుళ్ల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ : వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న 14మందిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ అంజయ్య తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామ శివారులో గల కోళ్ల ఫాంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం తెలిసింది. వెంటనే టాస్క్ ఫోర్స్ సీసీఎస్ సిబ్బంది దాడి చేసి పేకాట ఆడుతున్న 14మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 సెల్ ఫోన్లు, రూ.35,460 నగదు స్వాధీనం చేసుకున్నారు.  వారిని తదుపరి చర్యల నిమిత్తం వేల్పూర్ ఎస్ హెచ్ ఓకు అప్పగించారు.

More articles

Latest article