27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఒక వర్గానికి కల్లుడిపో దారాదత్తం

Must read

📰 Generate e-Paper Clip

  • వివాదాలను పరిష్కరించకుండానే ఎక్సైజ్ అధికారుల తీరు వివాదాస్పదం
  • మూడవ కల్లుడిపో (సొసైటీ) నిర్వాహణపై ఆందోళనకు సిద్దమౌతున్న గీతకార్మికులు
  • కార్మికుల నోట మట్టికొట్టిన అధికార పార్టీ నేత

నిజామాబాద్ , బతుకమ్మ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కల్లు తయారి కేంద్రం (కల్లుడిపో) వివాదాలను పరిష్కరించకుండానే ఏకపక్షంగా ఎక్సైజ్ శాఖాధికారులు వ్యవహరించిన తీరుపై గీత కార్మికులు మండిపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈత , తాటి చెట్లు లేకపోయినా మూడు సొసైటీలున్నాయి. అందులో లైసెన్స్ డ్ కలిగిన గీత కార్మికుల కేంద్రంగా మూడు కల్లు డిపోలు ఉన్నాయి. మొదటి, రెండు డిపోలు నిజామాబాద్ పట్టణ గౌడ సంఘం పేరిట దశాబ్ధాలుగా చెలామణి అవుతున్నాయి. దశాబ్ధం క్రితం పురుడు పోసుకున్న మూడవ డిపో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. నిజామాబాద్ కు సంబంధం లేని గీత కార్మికులను సభ్యులుగా చేస్తూ ఏర్పడిన కల్లుడిపో ఆది నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. నిజామాబాద్ నగరంలోని న్యాల్ కల్ రోడ్డులో ఉన్న మూడవ కల్లు డిపో పెత్తనం ఒకే కుటుంబానికి ఉండడం, కార్మికులకు మధ్య విభేదాలు పొడచూపాయి. రోజుకు లక్ష రూపాయలకు పైగా కల్లు విక్రయాలు జరిగే మూడవ డిపోలో 20 కల్లుబట్టిల ద్వారా కల్లు విక్రయాలు జరుగుతున్నాయి.

It is a gift to a community
గతేడాది జరిగిన కార్మికులకు, డిపో నిర్వాహకులకు మధ్య చర్చలు విఫలం కావడంతో మూడు నెలలు డిపోకు తాళం వేశారు. ఆనాడు గీత కార్మికుల సంఖ్య బలం ఆధారంగా బలప్రదర్శనకు దిగారు. గీత కార్మికులకు 29 మంది, డిపో నిర్వాహకులకు మిగిలిన వారు మద్దతు ఇవ్వగా ఆనాడు 11 బట్టిలు ఒకరికి, 9 కల్లుబట్టిలు మరొకరికి ఒప్పందం జరిగింది. కానీ అవి కూడా అమలు చేయకుండానే గొడవలు జరుగడంతో ఎక్సైజ్ అధికారులు కల్లుడిపోను మూసివేశారు. దాంతో మూడు నెలలు కల్లు విక్రయాలు బంద్ పడ్డాయి. ఈ నేపథ్యంలో కార్మికులకు, కుల సంఘం సభ్యులకు తీవ్ర నష్టం జరిగింది. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత జోక్యం చేసుకుని వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఎక్సైజ్ అధికారులను పురమాయించారు.
ఎక్సైజ్ అధికారులు మాత్రం ఏకపక్షంగా గీత కార్మికులకు అన్యాయం చేస్తూ డిపోను మళ్ళీ నిర్వాహకులకే అప్పజెప్పడం కలకలం రేపింది. ఈ విషయంపై బాధితులు ఏకంగా ఎక్సైజ్ శాఖ కమిషనర్ ను మొదలుకుని డిప్యూటీ కమిషనర్ తో పాటు పోలీసు అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గీత కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పడిన సొసైటీలో సభ్యులను అంగట్లో సరుకులు కొన్నట్లు కొనుగోలు చేసిన డిపో నిర్వాహకులు డిపోపై పెత్తనం చేయడం పై కార్మికులు మండిపడుతున్నారు. ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి రోజుకు లక్ష పైచిలుకు డబ్బులు ఇంటికి ఏ విధంగా తరలిస్తారని కార్మికులు మండిపడుతున్నారు. గీత కార్మికులకు న్యాయం చేయాలని ఆందోళనకు సిద్దమౌతున్నారు. త్వరలోనే గీత కార్మికులకు వారిపై ఆధారపడిన కుల సంఘాల సభ్యులతో కలిసి నిరసనకు పిలుపునిచ్చారు.

It is a gift to a community

More articles

Latest article