ఒక వర్గానికి కల్లుడిపో దారాదత్తం
వివాదాలను పరిష్కరించకుండానే ఎక్సైజ్ అధికారుల తీరు వివాదాస్పదం మూడవ కల్లుడిపో (సొసైటీ) నిర్వాహణపై ఆందోళనకు సిద్దమౌతున్న గీతకార్మికులు కార్మికుల నోట మట్టికొట్టిన అధికార పార్టీ నేత నిజామాబాద్ , బతుకమ్మ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కల్లు తయారి కేంద్రం (కల్లుడిపో) వివాదాలను పరిష్కరించకుండానే ఏకపక్షంగా ఎక్సైజ్ శాఖాధికారులు వ్యవహరించిన తీరుపై గీత కార్మికులు మండిపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈత , తాటి చెట్లు లేకపోయినా మూడు సొసైటీలున్నాయి. అందులో లైసెన్స్ డ్ కలిగిన గీత కార్మికుల కేంద్రంగా మూడు కల్లు డిపోలు ఉన్నాయి....