27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

డెయిరీలో సెలవులకై వాగ్వాదం

Must read

📰 Generate e-Paper Clip

  • సెలవులు ఇవ్వనని మేనేజర్
  • ఇవ్వాల్సిందేనని సిబ్బంది

    నిజామాబాద్, బతుకమ్మ:

విజయ డెయిరీలో వారాంతపు సెలవులను తాత్కాలిక సిబ్బందికి ఇచ్చేది లేదని మేనేజర్ జారి చేసిన హుకూంతో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. ఆయన నిర్వాకం వల్ల నివ్వెరపోయిన సిబ్బంది తేరుకొని, శాశ్వత ఉద్యోగుల మాదిరిగానే తాత్కాలిక సిబ్బందికి సెలవులు వర్తిస్తుంటాయని అదే తరహాలో స్పష్టం చేసారు. దీనితో మాట మాట పెరిగి వాగ్వాదానికి దారి తీసినట్లు తెలిసింది.

  • సెలవులు ఇచ్చేది లేదు…మేనేజర్

తానూ రెగ్యులర్ అధికారినని, తాత్కాలిక సిబ్బందిని కూలీలుగా పరిగణించి విర్రవీగిపోతున్నాడని ఆయన చేష్టలను గమనిస్తున్నవారు ఆరోపిస్తున్నారు. దీనివల్లే సిబ్బందికి, మేనేజర్ కు మద్య వైరాగ్యం ఏర్పడుతోంది. డెయిరీ అధికారి తీరు వల్ల తాత్కాలిక సిబ్బంది నలిగిపోతున్నారు. తానే పెద్ద అనే డాంబికాలను ప్రదర్శిస్తుండడంతో, పని చేయాలనుకునే సిబ్బంది.. ఆయన ప్రవర్తనతో విస్తుపోతున్నారు. పని చేయడం చేతగాదు, కనీసం చేయించుకునే నేర్పు లేదనే విమర్శలు వ్యాపిస్తున్నాయి. ఒక హోదాలో ఉన్న ఉద్యోగి హుందాగా నడుస్తూ సిబ్బందికి రోల్ మోడల్ గా ఉండాల్సిన అధికారి చీదరించుకునే స్థితికి దిగజారిపోయాడనే వదంతులు వినబడుతున్నాయి.

  • ఇవ్వాల్సిందే …సిబ్బంది

తాత్కాలిక సిబ్బంది అయినంత మాత్రాన అధికారి ఇంట్లో పని చేసే కూలీలం కాదని అది గుర్తెరిగి నడుచుకోవాలని పరోక్షంగా హితవు పలుకుతున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పని చేసే వారికి వారాంతపు సెలవులు ఉంటాయి గాని, ప్రభుత్వాధీనా రంగంలో వారికి సెలవులు ఇవ్వనని మేనేజర్ మాట్లాడడం మూర్ఖత్వపు చర్యలేనని దుయ్యబడుతున్నారు. కార్మిక చట్టాలను అనుసరించి వారాంతపు సెలవులు ఉంటాయనే విషయం తెలిసి సైతం సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నాడంటే, అంతరంగంలో చెడు ఉద్దేశాలు పరుగెడుతున్నాయనే అనుమానాలను సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. పాల సేకరణ పెంచకుండా గదిలో కూర్చొని సిసి టివి పూటేజిలను చూడడమే తప్ప, డెయిరీకి ఒనగూరే పనులు చేసిన సందర్భాలు లేవనే ఆరోపణలు వెలువడుతున్నాయి.

More articles

Latest article