27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎమ్మార్పీఎస్ యువ గర్జన పోస్టర్ల ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఎమ్మార్పీఎస్ యువ గర్జన పోస్టర్లను మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ ఆవిష్కరించారు. ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమాన్నినిర్వహించారు.  ఈ సందర్భంగా మాదిగ జేఏసీ జిల్లా ఇన్చార్జ్ అవార్డు గ్రహీత మోతే భూమన్న మాట్లాడుతూ మాదిగ నవ నిర్మాణ సమితి, దళిత స్కాలర్ అసోసియేషన్, సామాజిక తెలంగాణ విద్యార్థి అసోసియేషన్, తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్, బహుజన ఆశ సాధన సమితి,తెలంగాణ స్టూడెంట్ పొలిటికల్, జేఏసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రెండవ తేదీన హైదరాబాద్లోని ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ లో జరిగే మహా గర్జనను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట నడుద్దాం ఎస్సి వర్గీకరణను సాధిద్దామని అంశంపై సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గం ఇంచార్జ్ ఎంఆర్పిఎస్ నాయకులు వినోద్, గంగాధర్, నరసయ్య, హైమద్, నిజామాబాద్ జిల్లా గోసంగి సంఘం జిల్లా అధ్యక్షుడు చందు, నరేష్, శ్రీకాంత్,  విజయ్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article