27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 3 ఫిబ్రవరి 2025 నుండి 22 ఫిబ్రవరి 2025 వరకు 48 కేంద్రాలలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, 5 మార్చి 2025 నుండి 25 మార్చి 2025 వరకు 38 కేంద్రాల్లో థియరీ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటలవరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. థియరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయా తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల నిర్వహణ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ప్రాక్టికల్, థియరీ పరీక్షల నిర్వహణ సమయానికి ముందే వివిధ గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా సమయానికి ముందే బస్సులను ఆయా రూట్లలో నడపాలని తెలిపారు.  అవసరమైన ఫ్లయింగ్ స్క్వాడ్ లను నియమించాలని తెలిపారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటు ఆఫీసర్స్ లను ప్రభుత్వ కళాశాలలోని సిబ్బందిని నియమించాలని తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద 163 (144) సెక్షన్, ఫ్లయింగ్ స్క్వాడ్ లలో పోలీసు సిబ్బందిని కేటాయించాలని తెలిపారు. ఇన్విజిలేషన్ విధులకు అవసరమైన ఉపాధ్యాయులను కేటాయించాలని జిల్లా విద్యా శాఖాధికారినీ ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు అందించడానికి ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని మందులతో సహా కేటూయించాలని తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆయా పరీక్ష కేంద్రాల నుండి వచ్చే జవాబు పత్రాలను పార్శిల్ లను స్వీకరించి సంబంధిత అడ్రస్ కు పంపించాలని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి షేక్ సలాం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా విద్యా శాఖాధికారి రాజు, ఆర్టీసీ, వైద్యం, పోస్టల్, విద్యుత్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Intermediate exams should be conducted in a controlled manner

More articles

Latest article