ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్, థియరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 3 ఫిబ్రవరి 2025 నుండి 22 ఫిబ్రవరి 2025 వరకు 48 కేంద్రాలలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, 5 మార్చి 2025 నుండి 25 మార్చి 2025 వరకు 38 కేంద్రాల్లో థియరీ పరీక్షలు...