స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, బతుకమ్మ: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీకాలం జనవరి 26తో ముగిసింది. దీంతోమున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆదివారం ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ పాలకవర్గం పదవీకాలం ఈనెల 28వ తేదీతో ముగియనుంది. రాష్ట్రంలో ఇప్పటికే 141 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇటీవల కొత్తగా 12 మున్సిపాలిటీలను, మహబూబ్ నగర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. త్వరలోనే వీటన్నింటికీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది.
