28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బైపాస్ రోడ్ లో వృద్ధుడిని ఢీకొట్టిన కారు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : రోడ్డు దాటుతున్న వృద్ధుడిని గుర్తుతెలియని శాంట్రో కార్ ఢీ కొట్టింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. నిజామాబాద్ నగరంలో కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో కెసిఆర్ కాలనీ చౌరస్తా వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తి పేరు వెంకటరత్నం ఆని లక్ష్మీ నరసింహ అపార్ట్మెంట్ లో ఒంటరిగా ఉంటున్నట్టు తెలిసింది. అతనికి ఒక కూతురు తప్ప ఎవరూ లేరు అని సమాచారం. గాయపడిన వెంకటరత్నం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.

More articles

Latest article