బైపాస్ రోడ్ లో వృద్ధుడిని ఢీకొట్టిన కారు

నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : రోడ్డు దాటుతున్న వృద్ధుడిని గుర్తుతెలియని శాంట్రో కార్ ఢీ కొట్టింది. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. నిజామాబాద్ నగరంలో కంటేశ్వర్ బైపాస్ రోడ్డులో కెసిఆర్ కాలనీ చౌరస్తా వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తి పేరు వెంకటరత్నం ఆని లక్ష్మీ నరసింహ అపార్ట్మెంట్ లో ఒంటరిగా ఉంటున్నట్టు తెలిసింది. అతనికి ఒక కూతురు తప్ప ఎవరూ లేరు అని సమాచారం. గాయపడిన వెంకటరత్నం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు డయల్ 100 ద్వారా పోలీసులకు...