27.7 C
Hyderabad

ఉత్తమ క్షేత్ర సహాయకుడుగా శంకర్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామానికి చెందిన ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడిగా పనిచేస్తున్న శంకర్ ఉత్తమ క్షేత్ర సహాయకుడిగా ఎంపికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండలంలోని క్షేత్ర సహాయకులు మిఠాయిలు పంచి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మోర్తాడు ఏపీవో శకుంతల, క్షేత్ర సహాయకులు, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article