28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఫారెస్ట్  అర్బన్ పార్క్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఫారెస్ట్ లో సెంట్రల్ ఫండ్ తో అర్బన్ పార్క్ సుమారు 50 ఎక్టర్స్ లలో నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శంకుస్థాపన చేశారు. సెంట్రల్ స్కీమ్ పండ్ రూ.1.04 కోట్లు నిధులతో ఫస్ట్ పేస్ లో అలాగే రెండవ ఫేస్ లో రూ.16 లక్షలు మంజూరు అవుతున్నట్లు డీఎఫ్ఓ నిఖిత అన్నారు. ఈ పనులను మార్చ్ ఏప్రిల్ వరకు పూర్తి అవుతాయని అన్నారు. సుమారు 40 ఎకరాల్లో ప్రజలకు విజిటింగ్ కోసం ట్రాక్ ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. ఈ అర్బన్ పార్క్ లో వస్తున్న పరికరాల గురించి  ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కు డీఎఫ్ఓ నిఖిత వివరించారు.ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఫస్ట్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ మంజూరు కావడం చాలా గర్వాంగా ఉందని గుర్తు చేశారు. అందుకు ఫారెస్ట్ అధికారులకు ప్రతేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓ రామకృష్ణ, ఫారెస్ట్ శ్రీనివాస్ నాయక్, డీఎస్పీశ్రీనివాసులు, సీఐ రవీందర్ నాయక్, ఎస్ ఐ మహేష్, మార్కెట్ కమిటీ చేర్మెన్ రజిత వెంకట్ రాంరెడ్డి, మున్సిపల్ చేర్మెన్ పద్మ శ్రీకాంత్, మాజీ మున్సిపల్ చేర్మెన్ కుడుముల సత్యనారాయణ, ఫారెస్ట్ రేంజ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

MLA who laid the foundation stone for Forest Urban Park works.

More articles

Latest article