29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి

Must read

📰 Generate e-Paper Clip

కమ్మర్ పల్లి, బతుకమ్మ : కమ్మర్ పల్లి మండలంతో పాటు మండలం లోని నాగాపూర్ గ్రామానికి చెందిన పలువురు భాదిత కుటుంబాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరామర్శించారు.ఇందులో భాగంగా మండల కేంద్రానికి చెందిన కౌడా నర్సయ్య ఇటీవలే కాలం చేయగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి ఆర్ధిక పరిస్థితిని చూసి వారి కుటుంబానికి రూ. 10 వేలు నగదు సహాయం అందించారు. మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన బసకొండ దేవేందర్ భార్య పాము కాటుతో మరణించగా వారి కుటుంబాన్ని, జిల్లా బజాగౌడ్ ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని, అదే గ్రామానికి చెందిన నరేష్ హార్ట్ హెటేక్ తో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడు నరేష్ కుటుంబ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో వారి కుటుంబానికి రూ. 10వేల నగదు ఆర్ధిక సహాయంను ఎమ్మెల్యే అందజేశారు.

More articles

Latest article