27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

డ్రంక్ అండ్ డ్రైవ్  కేసులో ఐదుగురికి జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

. ఆరుగురికి జరిమానా

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో న్యాయస్థానం  ఐదుగురికి జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ పి ప్రసాద్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 11 మందికి కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం కోర్టులో హాజరుపర్చగా జయరాజ్ అనే వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష, యాదగిరి, సీహెచ్ నరేశ్, జితేందర్ కు రెండు రోజులు, బాలరాజుకు ఒక రోజు చొప్పున జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. మరో ఆరుగురికి మొత్తం రూ.9,500 జరిమానా విధించినట్లు వివరించారు.

More articles

Latest article