25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

ముప్కాల్, బతుకమ్మ : బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సుభాష్ చంద్ర బోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  బ్రిటిష్ వలస పాలకుల నుండి భారత దేశ విముక్తి కోసం అహర్నిశలు కృషి చేసిన స్వాతంత్ర్య సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితమే నేటి యువతరానికి దిక్సూచి అని అన్నారు.  భారతమాత ముద్దుబిడ్డగా ఎన్నో త్యాగాలు చేసి చిరస్మరణీయుడిగా నిలిచారని అన్నారు.

Subhash Chandra Bose's birth anniversary celebrations

More articles

Latest article