24 C
Hyderabad
Sunday, August 2, 2026

సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : బ్రిటిష్ వలస పాలకుల నుండి భారత దేశ విముక్తి కోసం అహర్నిశలు కృషి చేసిన స్వాతంత్ర్య సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితమే నేటి యువతరానికి దిక్సూచి అని చీనూరు గ్రామ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూత్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. గురువారం ‘ నేతాజీ చంద్ర బోస్ జయంతి సందర్భంగా గ్రామంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ పరాయి పాలన వద్దని, భారతదేశాన్ని భారత ప్రజలే పాలించుకుంటారని ఎలుగెత్తి చాటిన మహనీయుడని అన్నారు. భారతమాత ముద్దుబిడ్డగా ఎన్నో త్యాగాలు చేసి చిరస్మరణీయుడిగా నిలిచారని అన్నారు. నేటితరం బోస్ ను ఆదర్శంగా తీసుకుని ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల కృష్ణ, నారాయణరెడ్డి, మేకల ప్రశాంత్, ప్రశాంత్ రెడ్డి, కిషన్, సుధాకర్, యేసయ్య, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article