27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గుండారం పాఠశాలలో పర్యావరణ అవగాహన కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

తల్లి చెట్టు గుర్తింపు – ప్రకృతి రక్షణకు ప్రతిజ్ఞ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రకృతిని రక్షిస్తాం పర్యావరణాన్ని కాపాడుతాం అని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుడారం విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. గురువారం ఉదయం పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనే పర్యావరణ  సంస్థ ప్రతినిధులు అనుదీప్, జ్ఞానేశ్వర్ లు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి హితంగా జీవించడం, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చెట్లు నాటుతామని, వాటిని పెంచి కాపాడుతామని, చెట్లను ఎవరూ నరకకుండా చూస్తామని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేశారు. భూతాపం నుండి మానవ మనుగడను రక్షించేవి కేవలం చెట్లు మాత్రమే అని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి అమర్ నాథ్,  ఉపాధ్యాయిని , ఉపాధ్యాయులు ఎర్త్ లీడర్స్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Environmental Awareness Program in Gundaram School

More articles

Latest article