గుండారం పాఠశాలలో పర్యావరణ అవగాహన కార్యక్రమం
తల్లి చెట్టు గుర్తింపు - ప్రకృతి రక్షణకు ప్రతిజ్ఞ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రకృతిని రక్షిస్తాం పర్యావరణాన్ని కాపాడుతాం అని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుడారం విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. గురువారం ఉదయం పాఠశాలలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనే పర్యావరణ సంస్థ ప్రతినిధులు అనుదీప్, జ్ఞానేశ్వర్ లు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి హితంగా జీవించడం, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు చెట్లు నాటుతామని, వాటిని పెంచి కాపాడుతామని, చెట్లను ఎవరూ నరకకుండా చూస్తామని, ప్లాస్టిక్ వాడకాన్ని...