25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రిటైర్మెంట్ వయస్సు పెంచే యోచన మానుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • డీటీఎఫ్ ప్రెసిడెంట్ జాన్ విల్సన్

 

భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయస్సు 61 సంవత్సరాల నుండి 63 కి వయస్సు పెంచే యోచనను మానుకోవాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మండల్ ప్రెసిడెంట్ జాన్ విల్సన్ కోరారు. గురువారం మండలం లోని బెజ్జోరా, ముచ్కూర్, పిప్రి, బాచన్ పల్లి, పల్లికొండ, పాఠశాలల్లో అయన న్యూ ఇయర్ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్ లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయమై పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా ల్లో పుంకలు, పుంకాలుగా వార్తలు వస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వమే రిటైర్మెంట్ వయస్సును 58 నుండి 61 పెంచడం వల్లనే నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందని తెలిపారు. తద్వారా ఉపాధ్యాయులకు ప్రమోషన్ల అవకాశలు దెబ్బతిన్నాయన్నారు. రిటైర్మెంట్ వయసు పెంచడం మూలాన ఉద్యోగులకు అనారోగ్య సమస్యలు, పనిలో మండకోడీతనం లాంటి అనేక సమస్యలు ఉత్పన్నామౌతాయని అన్నారు. రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన వివిధ బకాయిలా భారం తగ్గించుకోవడానికి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. రిటైర్మెంట్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చెయ్యాలని అన్నారు. ఆయన వెంట మండల జనరల్ సెక్రటరీ గట్టు ఈశ్వర్ ఉన్నారు.

More articles

Latest article