28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

జాబితాలో పేరు లేకపోతే నిరాశ పడవద్దు

Must read

📰 Generate e-Paper Clip

  • సుల్తాన్ పేట్ ప్రజా పాలన గ్రామసభలో ఎంఈఓ రాములు

 

మద్నూర్, బతుకమ్మ: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత ఉన్న అభ్యర్థుల జాబితాలో పేరు లేకపోతే నిరాశ పడవద్దని ప్రజా పాలన గ్రామ సభలో మండల విద్యా అధికారి (ఎంఈఓ) రాములు తెలిపారు. మద్నూర్ మండలంలోని సుల్తాన్ పెట్ గ్రామంలో ప్రజా పాలన గ్రామసభ గురువారం నిర్వహించారు. సంక్షేమ పథకాలలో విడుదల చేసిన జాబితా తుది జాబితా కాదని పేర్లు రానివాళ్లు నిరాశ పడకుండా మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి లబ్ధిదారులకు లబ్ధి చేపడతారన్నారు. ప్రజా పాలన గ్రామసభలో తుది జాబితా ముందుగా అధికారులు వెల్లడించారు. జాబితాలో పేర్లు లేని వాళ్ళ కోసం మండల పరిషత్ కార్యాలయంలో నిరంతరం దరఖాస్తులు చేసుకునే విధంగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు వచ్చిన జాబితా తుది జాబితా కాదని ఇందులో కూడా మార్పులు, చేర్పులు జరుగుతాయని అర్హులకు మాత్రమే లబ్ధి జరుగుతుందని ఆయన సభాముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ సంజీవ్, రెవిన్యూ అధికారులు రవికుమార్, హనుమాన్లు, ఏఈఓ శివలింగు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article