26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బాలికల కళాశాలను సందర్శించిన అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ గురువారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల మైదానం లో ప్రిన్సిపాల్  తన స్వంత 40 వేల రూపాయల వెచ్చించి  మొరం వేయించి చదును చేయించి మొక్కలు పెంచడం పట్ల ఎమ్మెల్యే ప్రిన్సిపాల్ ను అభినందించారు. అంతకు ముందు కళాశాలలో ఉన్న మైదానం బురద గుంటలా ఉండేదని, కనీసం ప్రార్థన చేయడానికి విద్యార్థినులు నిలబడే పరిస్థితి లేదని ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాలలో మొక్కల పెంపకం ఎమ్మెల్యే ను ఆకట్టుకుంది. కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాల విషయమై ప్రీన్సిపాల్ బుద్ధిరాజ్  ఎమ్మెల్యేకు విన్నవించారు.  కళాశాల స్టేజ్ పైన షెడ్ నిర్మిస్తే విద్యార్థులకు  సౌకర్యంగా ఉంటుందని ప్రిన్సిపాల్ కోరారు. మైదానంలో మరింత మోరం వేయాల్సిన అవసరముందని ప్రిన్సిపాల్ ఎమ్మెల్యేకు వివరించారు.  విద్యార్థులకు ఎండ, వాన తో స్టడి అవర్ నిర్వహించడం ఇబ్బందిగా ఉందని తెల్పడంతో వెంటనే,  షెడ్ నిర్మాణానికి అంచనాలు రూపొందించి పంపించాలని, షెడ్ నిర్మాణానికి తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article