బాలికల కళాశాలను సందర్శించిన అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్
నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ గురువారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల మైదానం లో ప్రిన్సిపాల్ తన స్వంత 40 వేల రూపాయల వెచ్చించి మొరం వేయించి చదును చేయించి మొక్కలు పెంచడం పట్ల ఎమ్మెల్యే ప్రిన్సిపాల్ ను అభినందించారు. అంతకు ముందు కళాశాలలో ఉన్న మైదానం బురద గుంటలా ఉండేదని, కనీసం ప్రార్థన చేయడానికి విద్యార్థినులు నిలబడే పరిస్థితి లేదని ప్రిన్సిపాల్ తెలిపారు....