27.5 C
Hyderabad
Friday, July 31, 2026

తాము పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి అర్వింద్ అసలు రాజకీయాల్లో లేరు

Must read

📰 Generate e-Paper Clip

అరవింద్ ఎడబాయే నీ బెంజ్ కారు ముచ్చట?

. . . ఎంపీ అర్వింద్ గాలి మాటలు మాట్లాడడం మానేయాలి

. . . బిజేపి పసుపు రైతులను మోసం చేయడం మానుకోవాలి

. . . ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

 నిజామాబాద్, బతుకమ్మ: 

ఎంపీ అర్వింద్ కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటు..తాము పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి అర్వింద్ అసలు రాజకీయాల్లో లేరని కాంగ్రెస్ పార్టీలో ఆయన తండ్రిచాటు బిడ్డగా ఉన్నారు అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. స్పైసెస్ బోర్డు బెంజ్ కారులాంటిది. పసుపు బోర్డు అంబాసిడర్ కారులాంటిదని అర్వింద్ అన్నారు. ఒకవేళ బెంజ్ కారు ఉంటే అంబాసిడర్ కారు ఎందుకు ఇచ్చినట్లు అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ లో బీఆర్ఎస్  కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ లతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశంలో పసుపు బోర్డు పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నాం అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటించిన విధానంపై అభ్యంతరాలున్నాయి అన్నారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమంలా చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించకుండా ప్రోటొకాల్ పాటించలేదని కేవలం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూర్చొని ప్రారంభించుకున్నారు అని విమర్శించారు. 2014లో నేను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశాను అని గుర్తు చేశారు. ప్రధాన మంత్రిని నరేంద్ర మోదీని రెండు సార్లు కలిశాను పసుపు బోర్డుకు ప్రయత్నం చేస్తేనే పసుపు ఆధారంగా రావాల్సిన పరిశ్రమల కోసం కృషి చేశాను పసుపుకు రూ. 15 వేల మద్ధతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తు త్రిముఖవ్యూహంతో అలుపెరగని పోరాటం చేశాను అని కవిత అన్నారు. ఈ సంధర్బంగా అనాటి పోటోలను కవిత మీడియాకు వెల్లడించారు…

Arvind was not in actual politics when they demanded the yellow board

కేవలం బోర్డు రావడం మాత్రమే సరిపోదు…. మద్ధతు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఇతర దేశాల నుంచి నాణ్యతలేని పసుపు దిగుమతి అవుతుంది… దాంతో రైతులు నష్టపోతున్నారు పసుపు దిగుమతులను నియంత్రించాలని ఎప్పటి నుంచో నేను డిమాండ్ చేస్తున్నాను. 2014 లో 8 లక్లల క్వింటాళ్లు దిగుమతవుతే… ఇప్పుడు రెట్టింపయ్యిందని యేటేటా దిగుమతులు పెరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నారు. కేవలం రాజకీయం కోసం పసుపు బోర్డు కాకపోతే… వెంటనే దిగుమతులపై నియంత్రణ విధించాలని డిమాండ్ చేస్తున్నాను అన్నారు.

Arvind was not in actual politics when they demanded the yellow board

 ఎంపీగా గెలిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చిన అర్వింద్ ఎంపీగా గెలిచిన తర్వాత పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డే బాగుటుందని అన్నారు. తాము కేంద్రంపై పదేపదే ఒత్తిడి చేయడం వల్ల ఆ స్పైసెస్ బోర్డు కార్యాలయం ఏర్పాటైంది అన్నారు. ఎవరు ఏం చేయకున్నా ప్రతి మూడో సంవత్సరం పసుపు ధర పెరుగుతుంది కానీ అది తన ఘనత అని అర్వింద్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. రైతాంగాన్ని బీజేపీ మోసం చేయడం ఆపేయాల స్పైసెస్ పార్కు ఏర్పాటుకు వేల్పూర్ వద్ద కేసీఆర్ ప్రభుత్వం 42 ఎకరాలు కేటాయించారు ఆ పార్కులో పసుపు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి తద్వార  నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నారు. జక్రాన్ పల్లిలో విమానాశ్రయానికి కేసీఆర్ ప్రభుత్వం 800 ఎకరాలు సేకరించింది అక్కడ ఎయిర్ పోర్టు తీసుకురావాలని ఎంపీ అర్వింద్ ను డిమాండ్ చేస్తున్నాను కవిత అన్నారు. జాతీయ పసుపు బోర్డు చైర్మెన్ గా ఎన్నికైనా పల్లే గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కవిత ప్రతిపక్షాలను కలుపుకోని పసుపు రైతు శ్రేయస్సుకు, పరిశ్రమల స్థాపన, మద్ధత్తు ధరకు పని చేయాలని అన్నారు.

Arvind was not in actual politics when they demanded the yellow board

 

 

 

 

 

More articles

Latest article