ఆర్మూర్, బతుకమ్మ : బతుకమ్మ దినపత్రిక క్యాలెండర్ ను ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ పొద్దుటూరి వినయ్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దినపత్రికలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి ఉండాలని సూచించారు. అన్యాయాలను వెలికితీస్తూ ప్రజలను మేల్కొలిపే విధంగా కథనాలు రాయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, నవనాథ పురం ప్రెస్ క్లబ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు పాల్గొన్నారు.
