27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వివరాల సేకరణ సమగ్రంగా ఉండాలి 

Must read

📰 Generate e-Paper Clip

  • అడిషనల్ కలెక్టర్ అంకిత్ కుమార్ 

 

భీమ్ గల్, బతుకమ్మ : గ్రామాల్లోకి అధికారులు నిర్వహిస్తున్న రేషన్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో వివరాల సేకరణ సమగ్రంగా ఉండాలని డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్ అంకిత్ కుమార్ సర్వే అధికారులను ఆదేశించారు. మండలంలోని చెంగల్ గ్రామంలో నిర్వహిస్తున్న ఫీల్డ్ సర్వేను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్బంగా సర్వే అధికారులతో గ్రామంలో కాలినడకన తిరిగి ఇండ్ల సర్వేను పరిశీలించారు.సర్వే నిర్వహించే సమయంలో తప్పులు దొర్లకుండా చుకోవాలని తద్వారా డాటా ఎంట్రీ సమయంలో చాలా సులువవుతుందని తెలిపారు.ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న ఈ సర్వేను అధికారులు అన్ని ఇండ్లను వదలకుండా సర్వే నిర్వహించాలని ఆయన సూచించారు. అడిషనల్ కలెక్టర్ వెంట ఎంపీడీఓ సంతోష్ కుమార్,సర్వే అధికారులు, మండల అధికారులు ఉన్నారు.

More articles

Latest article