25.2 C
Hyderabad

భిక్కనూరు వైన్స్ తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్ధరామేశ్వర వైన్స్ శుక్రవారం దోమకొండ ఎక్సైజ్ సీఐ మధుసూదన్ ఆధ్వర్యంలో వైన్స్ ను తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా షాప్ లో ఉన్న మధ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ సమయపాలన పాటించాలని,స్టాక్ రిజిస్టర్ ను సరిగ్గా నిర్వహణ చేయాలన్నారు . ప్రభుత్వం విదించిన విధివిధానాలకు అనుకూలంగా వ్యవహరించాలని సూచించారు.  బెల్టు షాపుల నిర్వహించే వారిపై ఉక్కు పాదం మోపుతామని సిఐ మధుసూదన్ స్పష్టం చేశారు. భిక్కనూర్ వైన్స్ ఎదుట యు టర్నింగ్ ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నందున వైన్స్ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article