27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

విలీన సభను విజయవంతం చేయండి

Must read

📰 Generate e-Paper Clip

  • ఏఐకేఎంస్ నాయకులు వేల్పూర్ భూమయ్య

 

నిజామాబాద్, బతుకమ్మ్ : అఖిల భారత రైతు కూలీ సంఘాలు ఏఐకేఎంఎస్ విలీన సభను ఈనెల 19న మహబూబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఏఐకేఎంఎస్ నాయకులు వేల్పూర్ భూమయ్య తెలిపారు. ఈ విలీన సభకు రైతు కూలీ సంఘం కార్యకర్తలు, రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు జిల్లా కేంద్రంలోని ద్వారక నగర్ లో గల ఐఎఫ్టియు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంపై నిర్లక్ష్య వైఖరి కారణంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో  కూరుకుపోతున్న సమయంలో దేశంలోని రెండు అఖిల భారత రైతు కూలీ సంఘాలు ఏఐకేఎంఎస్,  విలీనమై రైతాంగ ఉద్యమాలను రూపొందించుకోవడానికి విలీన సభ నిర్వహించుకుంటుందని భూమయ్య అన్నారు. ముఖ్యంగా రైతాంగ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదని అన్నారు. నూతన మార్కెట్ విధానాన్ని తీసుకొస్తుందని ఎంఎస్పి మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని పార్లమెంట్లో తీసుక రాలేకపోతున్న నేపథ్యంలో రైతులకు తమ పంటలకు గిట్టుబాటు ధరలు అందలేక రైతులు అప్పుల సంక్షోభంలో కూరుకుపోతున్నారని వారు అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గత 52 రోజులుగా జగదీష్ సింగ్ ధ ల్లేవాల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని వారు చావు బతుకులో ఉన్న ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదానీ భూమయ్య అన్నారు.   రెండు రైతుకూలీ సంఘాల విలీన సభకు ప్రాధాన్యత ఉందని అందులో రైతాంగ సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా తగిన కర్తవ్యాల్ని రూపొందించుకొని రైతు కూలీ ఉద్యమాల్ని తీవ్రత తరం చేయడానికి ఈ సభ ఉపయోగపడుతుందని భూమయ్య అన్నారు. అందుకుగాను  సభను విజయవంతం చేయడానికి రైతులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా భూమయ్య కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి, జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, తదితరులు  పాల్గొన్నారు.

More articles

Latest article